నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థులతో బడిబాట ర్యాలీ నిర్వహించి గ్రామ రచ్చకట్ట వద్ద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. మురళీమోహన్ ఆచార్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానంలో ఆధునిక బోధనా పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చేరి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
అదేవిధంగా పదో తరగతిలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నాగరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మైబమ్మ, ఉపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, కృష్ణ కుమార్, ఎండి హుస్సేన్, సతీష్ రెడ్డి, శేఖర్, రాములు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.: నంది వడ్డేమాన్‌లో బడిబాట ర్యాలీ.. ఉత్తమ విద్యార్థులకు ఘన సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *