ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, తరగతి గదుల్లో విద్యతో పాటు మైదానంలో వ్యాయామం కూడా సమానంగా అవసరమని తెలిపారు. యువత దేశ భవిష్యత్తు కోసం కృషి చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులకు నిత్యం శిక్షణ అందిస్తున్న కోచ్ మల్లేష్ సేవలు అభినందనీయమని కొనియాడారు.
ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా తగినంత తాగునీరు తీసుకోవాలని సూచించారు. సుమారు రూ.50 వేల విలువైన 60 స్పోర్ట్స్ దుస్తులను 30 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వి. ప్రియాంక, ఈఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ త్రినాథ్, స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్, ఫిజియోథెరపీ నిర్వాహకులు చంద్రపాల్ రెడ్డి, కోచ్ మల్లేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తుల పంపిణీ


