ఈ పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని అజిలాపూర్ గ్రామంలో రూ.32.05 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ‘అజిలాపూర్ ఎత్తిపోతల పథకం’ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే స్థానిక రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
శంకుస్థాపన అనంతరం మంత్రులు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ (ఐడీఓసీ) భవనానికి చేరుకుని, మధ్యాహ్నం 3:50 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల వరి ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మిల్లింగ్ ప్రక్రియ, గిడ్డంగుల లభ్యత, చెల్లింపుల పరిస్థితి వంటి అంశాలపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలనే దిశగా సూచనలు చేసే అవకాశముంది.
సమీక్షా సమావేశం అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ గోదాములు, రైస్ మిల్లులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, మిల్లు యజమానులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారు.: రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యటన
