ఈ సందర్భంగా విశ్రాంత ఆప్తాలమిక్ ఆఫీసర్ బి. శివారెడ్డి మాట్లాడుతూ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి కి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తపరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం 9440454284, 8106333324 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.: నాగర్ కర్నూల్‌లో ఈనెల 13న ఉచిత కంటి చికిత్స శిబిరం…
