తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీకి సంబంధించిన గోడ పత్రికలను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మొసలి శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లోని జలవిహార్ లో తెలంగాణ జన సమితి పార్టీ నాల్గవ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఏర్పడిన పార్టీ తెలంగాణ జన సమితి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర లక్ష్యాలు విచ్ఛిన్నమయ్యాయని విమర్శించారు. అందుకే 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.
ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా తెలంగాణ జన సమితి పార్టీ పనిచేస్తోందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి సరైన సూచనలు అందించామని చెప్పారు. విద్యావంతుడైన ఎం. కోదండరాం కు విద్యాశాఖ బాధ్యతలు ఇస్తే విద్యారంగంలో మరింత మెరుగైన సేవలు అందిస్తారని అభిప్రాయపడ్డారు.
మరో ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగుతుందని, తెలంగాణ జన సమితి పార్టీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 12న జరిగే ప్లీనరీకి తెలంగాణ ఉద్యమకారులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.: తెలంగాణ జన సమితి నాల్గవ ప్లీనరీ పోస్టర్ల విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *