నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్) సబ్జెక్టులో నూటికి నూరు మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. డా. ప్రపుల్ చంద్రా రెడ్డి, డా. రమేష్ చంద్ర, తిరుమల ఎలక్ట్రికల్ సంస్థకు చెందిన టి. జనార్దన్, ఎన్‌ఆర్‌ఐ కె. జ్యోతి కిశోర్‌ల సహకారంతో ప్రతి విద్యార్థికి రూ. 1,116 చొప్పున నగదు బహుమతులు అందించారు. అలాగే ఈ విజయానికి మార్గదర్శకులైన సోషల్ టీచర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఏ. రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కృషి, పట్టుదలతో ఉన్నత ఫలితాలు సాధించగలరని అన్నారు. విద్యార్థులు లక్ష్యసాధనకు కట్టుబడి ఉండాలని, గురువుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ వాస రాఘవేంద్ర, జిల్లా సోషల్ పోరం అధ్యక్షుడు కృష్ణమోహన్, ప్రతినిధులు సువర్ణ, కెపీ ప్రసాద్, చంద్రశేఖర్, రాములు, నిరంజన్, ఎల్. వేణుగౌడ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగి విద్యార్థులకు ప్రేరణనిచ్చింది.: సోషల్‌లో 100 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *