అర్చకులు మాట్లాడుతూ, ప్రతి హిందూ కుటుంబం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి, మోక్షమార్గం సాధ్యమవుతుందని తెలిపారు. స్వామివారి అనుగ్రహం పొందేందుకు భక్తులు వీలైనంతవరకు ఈ వ్రతాన్ని చేయాలని సూచించారు. వ్రతంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక సంకల్పం నిర్వహించారు.
అనంతరం వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ రామాలయం అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో సామూహిక అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, టి. మల్లేష్, నేష నారాయణ, గొల్ల రాములు, శివ, ప్రవీణ్, చందు, యాదమ్మ, నిర్మలమ్మ, కిష్టమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మహిళా భక్తులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించారు.: నాగర్ కర్నూల్‌లో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు




