తనిఖీకి వచ్చి.. సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్!
బల్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ 8వ తరగతి విద్యార్థులకు స్వయంగా సాంఘిక శాస్త్రం పాఠం బోధించారు.
బల్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ 8వ తరగతి విద్యార్థులకు స్వయంగా సాంఘిక శాస్త్రం పాఠం బోధించారు.
మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్‌లో సోషల్‌లో 100 మార్కులు సాధించిన 21 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. డీఈఓ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించగా 10,651 మందిలో 10,630 మంది విద్యార్థులు హాజరయ్యారు.
నాగర్‌కర్నూల్‌లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం ప్రశ్నపత్రాలను పోలీస్ బందోబస్తు మధ్య ఆయా పోలీస్ స్టేషన్లకు భద్రపరిచారు. జిల్లాలో 60 కేంద్రాల్లో 10,658 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.