*నాగర్ కర్నూల్ జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి*…
మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 114ను రద్దు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు. నాలుగేండ్లుగా ఎంబిబిఎస్ సీట్లు కేటాయింపుల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు లోప భూష్టంగా ఉన్నాయని విమర్శించారు. 300 మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, 550 జీవోను పక్కనపెట్టి 2021 లో 114 జీవోను తెచ్చి బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 550 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పట్టణ బిసి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు గొడుగురాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఉన్న 550 జీవోను పక్కనపెట్టి 2021 లో 114 జీవోను తెచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దీనిని సరిదిద్దాలని అధికారులు. మంత్రులను కలిసి బీసీ రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదన్నారు. సుప్రీంకోర్టు జీవో నెంబర్ 550 ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలని తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు గొడుగురాజు, మహేష్, ఆకాష్ తిరుపతయ్య రాములు,రాజు, రమేష్, హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.: 550 జీవో ప్రకారమే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి..
