ఐజేయూ నాగర్ కర్నూల్ జిల్లా నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గోలి సుదర్శన్ రెడ్డి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించగా, మరో ఐజేయూ సభ్యుడు రూ.5 వేల సహాయం చేశారు. మొత్తంగా రూ.15 వేల రూపాయలను గురువారం నాగర్ కర్నూల్‌లో రామస్వామికి అందజేశారు.
ఇదే కాకుండా గతంలో కూడా క్లాస్‌మేట్ క్లబ్ తరఫున కొంత ఆర్థిక సహాయం అందించినట్లు సభ్యులు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత, సహకార భావం మరోసారి చాటుకున్న ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి. విజయకుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రమణ కుమార్, జయప్రసాద్, పాలాది యాదయ్య, సీనియర్ నాయకులు కొండకింది మాధవరెడ్డి, నాగర్ కర్నూల్ తాలూకా ఉపాధ్యక్షుడు జంగిటి రాంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన జర్నలిస్టు మిత్రుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.: జర్నలిస్టు కూతురు చదువు కోసం ముందుకొచ్చిన జర్నలిస్టులు
