ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని పేర్కొన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో సస్యశ్యామలంగా అభివృద్ధి చెందిందన్నారు. రైతాంగం, పేదలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని, గౌరవనీయులు కేసీఆర్ నాయకత్వంలో మరో ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
“తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం – మన తెలంగాణను రక్షించుకుందాం” అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు










