Tag: BRS Party

హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:

నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని తెలంగాణ తల్లి, అమరవీరులకు నివాళులర్పించి కార్యకర్తలకు పునరంకిత పిలుపునిచ్చారు.

రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయాలి

యాసంగి పంటలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్లపై ఉద్రిక్తత

మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్ల తొలగింపుపై మున్సిపల్ అధికారులు, పోలీసులతో BRS శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బస్టాండ్ సమీపంలో ఘర్షణ చోటుచేసుకుంది.

కుమ్మెర ఘటనపై కాంగ్రెస్ కుట్రలు

కుమ్మెర గ్రామ చిన్నారి మృతి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.