నాగర్ కర్నూల్లో మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణల తొలగింపుపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. BRS పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు చర్యలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలోని రామాలయం కమాన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ స్ట్రీట్ లైట్స్పై ఏర్పాటు చేసిన కోల్డ్ ఫైర్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు, కరెంట్ శాఖ అధికారులు వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు.

అయితే, ఈ చర్యలను వ్యతిరేకిస్తూ BRS పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. దీంతో అధికారులు మరియు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశముండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.: మర్రి జనార్ధన్ రెడ్డి జన్మదిన ఏర్పాట్లపై ఉద్రిక్తత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *