నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగి భక్తులను ఆకట్టుకున్నాయి.

కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ సరితా రాజేష్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసిన ఏర్పాట్లను అభినందించారు.

మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *