ఈ సందర్భంగా 6వ తరగతి విద్యార్థి దీక్షిత్ శ్రీ రాముడి పాత్రను పోషించి అందరి ప్రశంసలు పొందగా, 4వ తరగతి విద్యార్థిని,పల్లవి సీతాదేవిగా ఆకట్టుకుంది. 4వ తరగతి విద్యార్థి అభ్యుదయ లక్ష్మణ పాత్రలో మెప్పించగా, 6వ తరగతి విద్యార్థి హేమంత్ హనుమాన్ పాత్రను పోషించి ప్రత్యేకంగా నిలిచాడు. నర్సరీ తరగతి విద్యార్థి ధ్రువణ బాలరాముడి వేషధారణలో అందరినీ ఆకర్షించాడు.
ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షులు వాసా రమేష్ బాబు, ఉపాధ్యక్షులు మిడిదిడ్డి చంద్రశేఖర్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ కార్యవాహ పత్తికొండ రాంరెడ్డి, విభాగ సహా కార్యదర్శి కందూరి బాలరాజు, జిల్లా సహా కార్యదర్శి నాగరాజు, సభ్యులు శివరావు, ప్రకాష్ తదితరులు హాజరయ్యారు. పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా, కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా సాగి అందరినీ ఆకట్టుకుంది.: రామనవమి వేడుకల్లో చిన్నారుల అలరింపు




