ఈ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హాజరై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని మారుమోగించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సిర్సనగండ్లను “దక్షిణ అయోధ్య”గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తి భావంతో వైభవంగా కొనసాగాయి.: సిర్సనగండ్లలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు


