ఈ ప్రతిష్టాత్మక రైల్వే లైన్ సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల మీదుగా సాగనుంది. ఈ లైన్ అమలులోకి వస్తే లక్షలాది ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరగడం, పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదం చేయనుంది.
ఈ ప్రాజెక్ట్‌కు వేగం తీసుకురావడంలో ఎంపీ పోతుగంటి రాములు కీలక పాత్ర పోషించారు. ఆయన పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా, కేంద్ర రైల్వే మంత్రికి పలుమార్లు లేఖలు రాసి ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించడంలో కృషి చేశారు. 2023లోనే FLS అనుమతి సాధించడం ఈ కృషికి నిదర్శనం.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు ప్రాధాన్యత పెరుగుతుండగా, తెలంగాణలో కూడా రైల్వే అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ కొత్త రైల్వే లైన్ తెలంగాణ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలవనుంది.: తెలంగాణలో రైల్వే అభివృద్ధికి మరో కీలక ముందడుగు
