పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి……. డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి…… యాసంగిలో రైతులు పండించిన ప్రతి మొక్కజొన్న గింజను కొనుగోలు చేసి ప్రభుత్వం వెంటనే వారి ఖాతాలో డబ్బులను జమ చేయాలని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం జిల్లా కేంద్రంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అవస్థలు మరింత పెరిగాయని ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 40 క్వింటల మొక్కజొన్న దిగుబడి అవుతున్న పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని నిబంధనలు విధించడం వల్ల మిగిలిన పంటను రైతులు తక్కువ ధరకే దళారులకు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులతో పాటు కౌలు రైతులు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేయాలని కోరారు. గతంలో తమ ప్రభుత్వం గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోనే ఒక్క కేంద్రంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సన్న వడ్లకు బోనస్ పూర్తిగా రైతులకు అందలేదని అన్నారు మునిసిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను చెల్లించలేదని తాగునీటి కలెక్షన్ను తొలగించడం దారుణమని ఒకవైపు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నిధులు కావాలని అసెంబ్లీలో అడగడం ఇక్కడ మాత్రం నీటి కనెక్షన్ తొలగించడంపై చేశారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అర్థం రవి బాలా గౌడ్ లక్ష్మయ్య కౌన్సిలర్ అర్జునయ్య అహ్మద్ సత్యం భిముడు విష్ణు చారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు: రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయాలి Post navigation హోంగార్డు అనుమానాస్పద మృతి కలకలం నాగర్కర్నూల్లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం