ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించనున్నారు. ముఖ్యంగా క్యాటరాక్ట్ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మహబూబ్‌నగర్‌లోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రక్తపరీక్షలు మరియు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
శిబిరానికి హాజరయ్యే వారు తమ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440454284, 8106333324 నంబర్లలో సంప్రదించవచ్చు.: నాగర్‌కర్నూల్‌లో ఈనెల 8న ఉచిత కంటి చికిత్స శిబిరం
