నాగర్‌కర్నూల్ జిల్లాలో హోంగార్డు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచు గూడెం గ్రామానికి చెందిన తిరుగుడు భయన్న (45) అచ్చంపేటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం వెలుగులోకి వచ్చింది. భయన్న కోడేరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

సమాచారం ప్రకారం, సలేశ్వరం జాతర బందోబస్తు విధుల నిమిత్తం అచ్చంపేట ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భయన్న మృతదేహాన్ని అచ్చంపేట నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మర్చురీకి తరలించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు వివాహిత కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఈ సంఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.: హోంగార్డు అనుమానాస్పద మృతి కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *