ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవింపుతో తెలంగాణ అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోందని పేర్కొన్నారు.
భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ హైదరాబాద్ మినీ భారత్‌లా విలసిల్లుతోందని, భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ గొప్ప ప్రతీకగా నిలిచిందన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని, రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.
అనంతరం కూచుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు






