హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కళాబృందం ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, సచివాలయ అసోసియేషన్, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ గోరటి చెన్నకేశవులు, ఇతర శాఖల సిబ్బందితో కలిసి ‘స్ట్రిక్ట్ ఆఫీసర్’ లఘు నాటికను ప్రదర్శించారు. సామాజిక అంశాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లఘు నాటికను కళాబృంద సభ్యులు చక్కటి సమన్వయంతో ప్రదర్శించారు. రవీంద్రభారతి వేదికపై జరిగిన ఈ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు కళాకారులుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉద్యోగ విధులతో పాటు కళా, సాంస్కృతిక రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్న సిబ్బందిని నిర్వాహకులు అభినందించారు.

నాటిక ప్రదర్శన అనంతరం నిర్వాహకులు కళాబృంద సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాబృంద సభ్యులు, వివిధ శాఖలకు చెందిన బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వేదికపై నాగర్ కర్నూల్ జిల్లా బృందం ప్రదర్శన ఇవ్వడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.: రవీంద్రభారతిలో ‘స్ట్రిక్ట్ ఆఫీసర్’ లఘు నాటిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *