కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ కార్యవాహ పత్తికొండ రాము మాట్లాడుతూ, సరస్వతి శిశుమందిర్‌లు కేవలం విద్యను అందించే సంస్థలు మాత్రమే కాకుండా సంస్కార నిలయాలుగా పనిచేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు సంస్కారం, దేశభక్తి, దైవభక్తి, పరోపకారం వంటి నైతిక విలువలను, కుటుంబ విలువలను పెంపొందించడం అవసరమని సూచించారు.
విభాగ కార్యదర్శి ఎల్లప్ప మాట్లాడుతూ, సంగీతం, నైతిక శిక్షణ, ఖేల్‌కుద్, శారీరక అంశాలు వంటి ఆధారభూత విషయాలపై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విద్యార్థులను దేశానికి అందించడమే శిశుమందిర్ పాఠశాలల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు వాస రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు మిడిదొడ్డి శివశంకర్, ప్రతినిధులు కందూరు బాలరాజు, మిడిదొడ్డి నాగరాజు, కందాల రవీంద్రాచారి, కొండె కృష్ణమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.: సరస్వతి శిశుమందిర్ సంస్కార నిలయాలు..





