శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శ్రీశనేశ్వర స్వామికి ప్రత్యేక తిలతైలాభిషేక పూజలు నిర్వహించి భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ, భాద్రపద మాసంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని తెలిపారు. జన్మరీత్యా, గోచారరీత్యా ఏర్పడే శనిగ్రహ దోషాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ శక్తిమేరకు స్వామివారిని పూజించాలని సూచించారు.
అదే ఆలయ ప్రాంగణంలో గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మసూత్రం గల పరమశివునికి భక్తులు రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు నిర్వహించారు. నందీశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అర్చన పూజలు చేపట్టారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి. సుగుణమ్మ, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.: శ్రీశనేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో తిలతైలాభిషేకాలు..



