చివరకు రోగి కుటుంబం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్, సోమాజిగూడను ఆశ్రయించింది. అక్కడ గతంలో జరిగిన చికిత్సలు, వైద్య నివేదికలు, ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించిన డా. జగదీశ్ మాడిరెడ్డి, సమస్యకు అసలు కారణాన్ని గుర్తించి ప్రత్యేక చికిత్సా ప్రణాళికను రూపొందించారు.
సరైన ప్రణాళికతో చికిత్స నిర్వహించడంతో రోగి విజయవంతంగా కోలుకున్నారు. చికిత్స అనంతరం రెండేళ్లుగా పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్ తిరిగి రాకపోవడం విశేషం. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు.
పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సమస్య క్లిష్టంగా మారే అవకాశం ఉందని డా. జగదీశ్ మాడిరెడ్డి తెలిపారు. ఇన్ఫెక్షన్ నియంత్రణతో పాటు మొదటి నుంచే సరైన నిర్ణయం, ఖచ్చితమైన చికిత్సా విధానం ఎంతో కీలకమని వివరించారు. చిన్నదిగా కనిపించే వైద్య ప్రక్రియలోనూ సరైన ప్రణాళిక, సమర్థవంతమైన అమలు అవసరమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, డా. జగదీశ్ మాడిరెడ్డి ప్రతి నెల రెండవ, నాలుగవ ఆదివారాల్లో పుల్లారెడ్డి హాస్పిటల్‌లో ఓపీడీ సేవలు అందించనున్నారు. మీడియా సమావేశంలో పుల్లారెడ్డి హాస్పిటల్ మేనేజర్ సాయిబాబా, యశోద హాస్పిటల్స్ యాజమాన్యం తరఫున మేనేజర్ ఉమేశ్ పాల్గొన్నారు.: పేస్‌మేకర్ ఇన్ఫెక్షన్‌కు శాశ్వత పరిష్కారం | యశోద హాస్పిటల్స్‌లో విజయవంతమైన చికిత్స
