జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామంలో ఉడిపి పాలిమర్ పీఠాధిపతుల 48వ చాతుర్మాస్య మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. పెద్ద చింతరేవుల ఆంజనేయ అన్నప్రసాద సత్రంలో పీఠాధిపతుల ఆధ్వర్యంలో దీక్షా పూజలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు చాతుర్మాస్య మహోత్సవ దీక్షా పూజలు కొనసాగనున్నట్లు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు.

ఆదివారం 44వ రోజు చాతుర్మాస్య ప్రత్యేక పూజలను పాలిమర్ పీఠాధిపతులు శ్రీ 1008 విద్యాదిశ తీర్థ శ్రీపాదులు, శ్రీ 1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదులు సంయుక్తంగా నిర్వహించారు. ఉడిపి వేద అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య మూలరాములకు, శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్వామీజీలు భక్తులకు భాగవతం, రామాయణ ప్రవచనాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పవమాన హోమం, నవగ్రహ హోమం, గోపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజల అనంతరం పీఠాధిపతులు భక్తులకు మంత్రాక్షతలు అందించి ఆశీర్వచనాలు చేశారు.

పెద్ద చింతరేవుల ఆంజనేయ అన్నప్రసాద ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా పీఠాధిపతులు ప్రత్యేక వినాయక చవితి పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆద్య వామనాచారి, ఆద్య కిష్టాచారి, ఆద్య మద్వాచారి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.: పెద్ద చింతరేవులలో వైభవంగా 48వ చాతుర్మాస్య మహోత్సవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *