జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు బిల్లాకంటి హరిబాబు నివాస గ్రౌండ్‌లో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి శోభాయాత్రగా విగ్రహాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకువచ్చారు. శోభాయాత్రలో ఆర్యవైశ్య ప్రముఖులు, యువజన సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాల మధ్య విగ్రహాన్ని ఆలయానికి చేర్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించారు.

వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు బిల్లాకంటి హరిబాబు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మిడిదొడ్డి అంజయ్య, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు నరేష్, కార్యదర్శులు వాసుబాబు, కోశాధికారి రాఘవేందర్‌తో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, పట్టణ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.: జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *