Tag: Vinayaka Chavithi

వినాయక మండపం ముందు భక్తులకు అన్నప్రసాద పంపిణీ..

నాగర్ కర్నూల్ ఎర్రగడ్డలోని చేయూత వెల్ఫేర్ సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

రాఘవేంద్ర కాలనీలో వైభవంగా గణేశ్ ఉత్సవాలు..

నాగర్ కర్నూల్ రాఘవేంద్ర కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన..

జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. శోభాయాత్రగా విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.