నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ రోడ్ నంబర్ 1లో వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపతి మహాస్వామికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అర్చకులు గోమటం మురళీమోహన్ ఆచార్యులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కాలనీకి చెందిన ఎస్. గోపాల్ రెడ్డి, ఆంజనేయులు, జెట్టి జ్యోతిశ్వరి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో గణపతికి పూజలు నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.

పూజా కార్యక్రమాల అనంతరం గణపతి స్వామికి నివేదించిన ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గణేశ్ ఉత్సవాల్లో భాగంగా పెద్ద సంఖ్యలో కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర, మాజీ వైస్ చైర్మన్ సి. బాబురావు పాల్గొన్నారు. అలాగే కాలనీవాసులు జెట్టి ధర్మరాజు, పద్మారావు, బ్యాంక్ శ్రీనివాస్, వేణు గౌడ్, కుర్మయ్య తదితరులు హాజరయ్యారు.

బజరంగ్ యూత్ అధ్యక్షులు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ప్రశాంత్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, నిఖిల్, అఖిల్, నాగరాజ్, కార్తీక్, భరత్, క్రాంతి, సింహాద్రి, కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు యువత, కాలనీవాసులు సహకరించారు.: రాఘవేంద్ర కాలనీలో వైభవంగా గణేశ్ ఉత్సవాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *