నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీ రోడ్ నంబర్ 1లో గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి.

అర్చకులు గోమటం మురళీమోహన్ ఆచార్యులు శాస్త్రోక్తంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు పి. పద్మారావు, కే. శ్రీనివాసులు, శివకుమార్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విఘ్నాలను తొలగించి కాలనీవాసులందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని గణనాథుడిని భక్తులు ప్రార్థించారు.

పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం స్వామివారికి నివేదించిన ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ అధ్యక్షులు సందీప్ కుమార్, యూత్ సభ్యులు ప్రశాంత్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, నిఖిల్, అఖిల్, నాగరాజ్, కార్తీక్, భరత్, క్రాంతి, సింహాద్రి, కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై గణేష్ ఉత్సవాలను విజయవంతం చేశారు.: రాఘవేంద్ర కాలనీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *