నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని రోగులు, వారి సహాయకులు మరియు ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. సమాజ సేవే తన లక్ష్యమని, ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలోని శ్రీ జ్ఞానేశ్వర వాత్సుల్య మందిర్‌ను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి చిన్నారులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

ప్రజాసేవను ప్రధాన ధ్యేయంగా తీసుకుని జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్యేను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు నిజాం, శంకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.: సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *