*ప్రభుత్వ పాఠశాలలను తగ్గించాలనే ప్రకటనను సీఎం గారు వెనక్కి తీసుకోవాలి*….
*బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో మంగళవారం రోజున సత్యశిల సాగర్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వారు ఇచ్చిన అవకాశం మేరకు నాగర్ కర్నూల్ జిల్లా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 25 సీట్లు కేటాయింపు జరగాలని తల్లిదండ్రులలో తల్లి గాని లేదా తండ్రి గాని లేని పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో వారి మౌలిక వసతులకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో ఒక నిర్దిష్ట ఫీజులను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకానీ ఇష్టానుసారంగా పుస్తకాలు, షూస్, టై, బెల్టు, డ్రెస్సులు, బస్సు ట్రాన్స్పోర్ట్ అని నానా రకాల ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం 27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటి నుండి 23 వేల పాఠశాలలు తీసివేసి 4000 పాఠశాలలకు కుదించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల పేరుతో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్లు ఉంది అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జీవో 18 మరియు 50 తీసుకువచ్చి ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులలో విద్యార్థుల ఫీజులు కట్టి విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండగలిగారని అన్నారు. దానికి విరుద్ధంగా ఇంజనీరింగ్ చదవాలంటే 10 నుండి 12 లక్షలు డొనేషన్ల పేరుతో కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయని. సంవత్సరానికి మూడు లక్షలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు మరియు కార్పొరేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 సీట్లు అమలయ్యేంతవరకు, ఫీజుల నియంత్రణ ఏర్పాటు జరిగే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. సామాజిక తెలంగాణ సాధన సమితి జిల్లా అధ్యక్షులు దాసర్ల వెంకటస్వామి, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్, టిఆర్పి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు జయపాల్ రెడ్డి మున్నూరు కాపు, టి అర్ పి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, టిఆర్పి వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ బీసీ జేఏసీ నాయకులు అబ్బ కరుణాకర్, జహంగీర్, గుడ్ల నర్వ బాల్ లక్ష్మయ్య, సతీష్, తదితర బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలి




