*హాజరైన స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి గారి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కార్యక్రమానికి బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై చారికి శాలువా కప్పి పూలమాల వేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ అరవింద చారి గత 15 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నాడని విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని జీవితాన్ని ప్రారంభించిన ఆయన గతనాలుగేళ్లుగా బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి పివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, పెబ్బేరు గౌడ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పారిశ్రామికవేత్త వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు: ఘనంగా దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *