నాగర్‌కర్నూల్ పట్టణంలోని 16వ వార్డులో నిర్వహించిన శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని శ్రీ వీరనాగమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సామరస్య భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని భక్తులను పలకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, 16వ వార్డు కౌన్సిలర్ సింధు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్, కౌన్సిలర్లు శంకర్, ఖాజాఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.: నాగర్‌కర్నూల్ 16వ వార్డులో శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *