వారి ప్రకారం, బాధితుల ప్రతినిధులు ప్రజాప్రతినిధులను కలిసి తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, ఎంపీ బాధితుల సమస్యను సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని తెలిపారు.
నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 75/2023 దర్యాప్తులో నిందితులు సుమారు రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా సేకరించినట్లు వెల్లడైనట్లు సమావేశంలో పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ పరిహారం పొందిన అనేక మంది రైతులు ఈ మోసానికి గురయ్యారని, పెట్టుబడులపై అధిక వడ్డీ, ప్లాట్ల హామీలతో మోసం చేసినట్లు ఆరోపించారు.
ఇప్పటికే నిందితుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసినప్పటికీ, వాటి వేలం ప్రక్రియ ఆలస్యం కావడంతో బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జప్తు చేసిన ఆస్తులను అత్యవసరంగా బహిరంగ వేలం వేసి వచ్చిన మొత్తాన్ని బాధితులకు పంపిణీ చేయాలని కోరగా, ఆ ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు తెలిపారు.: ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.



