ఈ ఆపరేషన్‌లో మొత్తం 52 దొంగిలించిన మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడి రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకుల అసలు యజమానులను గుర్తించి వాటిని తిరిగి అప్పగించే ప్రక్రియను కూడా పోలీసులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు దర్యాప్తు బృందంలోని ఇతర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పటేల్ అభినందించారు. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల ఆస్తులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వాహన యజమానులు తమ వాహనాలకు భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసుల
కు సమాచారం అందించాలని సూచించారు.: నాగర్ కర్నూల్‌లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..
