అంతేకాకుండా పాత కేబుల్‌పైనే సర్వీస్ వైర్లను రన్ చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎప్పుడు వైర్లు తెగిపడతాయోననే భయంతో ప్రజలు, రైతులు ఆ మార్గంలో ప్రయాణించేందుకు కూడా ఆందోళన చెందుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్ చుట్టూ దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో తేమ కారణంగా విద్యుత్ లీకేజీ జరిగే అవకాశం ఉందని, దీంతో పశువులు, రైతులు, అటుగా వెళ్లే ప్రజలకు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాత కేబుళ్లను వెంటనే తొలగించి, సర్వీస్ వైర్లను సక్రమంగా ఏర్పాటు చేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లోని పొదలను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.: నాగనూల్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..



