నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి డిండి వరకు నీటిని తరలించే ప్రతిపాదనపై ప్రత్యేకంగా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రతిపాదన అమలులో నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని, ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు వేగవంతం కావడానికి ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన నిధులను విడుదల చేసిందని తెలిపారు.

కొత్త ప్రతిపాదన ద్వారా రెండు జిల్లాలకు సమాన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు ప్రాంతంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.: పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *