నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ప్రశంసించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్ష నిర్వహిస్తూ, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫాంల కుట్టింపును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

యూనిఫాంల నాణ్యత, కొలతల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేసిన సీఎస్, ఆగస్టు 10లోగా ప్రతి విద్యార్థికి తొలి జత, ఆగస్టు 25లోగా రెండో జత యూనిఫాంలను అందజేయాలని సూచించారు. ముఖ్యంగా కేజీబీవీ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉండటంపై అభినందనలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలోని 923 ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 81,174 మంది విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

అదేవిధంగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, మార్కెట్ అవకాశాలు, విత్తనాల పంపిణీ వంటి అంశాలపై రైతులకు సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ, ఉద్యాన, భూగర్భ జలాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.: యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *