Tag: Government Schools

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసన సామర్థ్యాలు, ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఫలితాలు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసలు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సీఎస్ సంజయ్ జాజు ప్రశంసించారు. ఆగస్టు 25లోగా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP వినతి

నాగర్‌కర్నూల్ జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో బడి బయట పిల్లల గుర్తింపు, మధ్యలో చదువు మానేసిన విద్యార్థుల పునఃప్రవేశంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

పాఠశాల పరిశుభ్రత కార్యక్రమంలో చీపురు పట్టిన కలెక్టర్ సంతోష్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తూ పాల్గొన్నారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల్లో…

నాగర్ కర్నూల్ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాసిరకం:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్‌మాస్టర్ మరియు…