ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డాక్టర్ ఎం.డి. రఫీని అభినందించి సన్మానించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమిష్టి కృషి, వైద్య సిబ్బంది అంకితభావం, ప్రజల సహకారంతోనే ఈ ఘన విజయం సాధ్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, ముందస్తు గుర్తింపు, చికిత్స, అవగాహన కార్యక్రమాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విశేష ఫలితాలు సాధించిందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ రఫీకి అవార్డు రావడం నాగర్‌కర్నూల్ జిల్లాకు గర్వకారణమని అన్నారు.
భవిష్యత్తులో కూడా క్షయ వ్యాధి రహిత జిల్లాగా నాగర్‌కర్నూల్‌ను తీర్చిదిద్దేందుకు అధికారులు మరింత కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కూడా క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.: క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానం..
