అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి, జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
2024లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాలపై ఎంఈఓ, డీఈఓలకు ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ జరగలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అదే పాఠశాలకు అనుమతి ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలపై బాలల హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల అమలు, పాఠ్యపుస్తకాల విక్రయాలపై పర్యవేక్షణ సరిగా లేదని విమర్శించారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
నాగనూలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహార నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తిమ్మాజిపేట కేజీబీవీ పరిపాలన, UDISE లాగిన్ వివరాలు, సీసీ కెమెరాల అనుసంధానం, ఉద్యోగి వివరాల ఆన్లైన్ నమోదుకు సంబంధించిన అంశాలపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేవని ఆరోపిస్తూ, అయినప్పటికీ అనుమతి మంజూరు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై వచ్చిన ఆరోపణలన్నింటిపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్, MSF జిల్లా అధ్యక్షుడు బుక్కాపురం మహేష్, BSF జిల్లా అధ్యక్షుడు మద్దెలబండ సాయిబాబు, UISF జిల్లా అధ్యక్షుడు సయ్యద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు డేగ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.: జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…




