నాగర్‌కర్నూల్: ఐదు నెలల గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి, అండాశయంలో ఉన్న సుమారు మూడు కిలోల కణితిని తొలగించినట్లు నాగర్‌కర్నూల్‌లోని శ్రీశివ నర్సింగ్ హోమ్ వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం గర్భం సురక్షితంగా ఉన్నట్లు స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ బి. నీరజారెడ్డి వెల్లడించారు.

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన ఐదు నెలల మొదటి గర్భవతి శ్రీజ తీవ్రమైన కడుపునొప్పితో శ్రీశివ నర్సింగ్ హోమ్‌కు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ బి. నీరజారెడ్డి ఆమెను పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించగా అండాశయంలో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఆదివారం గర్భిణికి శస్త్రచికిత్స నిర్వహించి సుమారు మూడు కిలోల కణితిని విజయవంతంగా తొలగించినట్లు డాక్టర్ నీరజారెడ్డి తెలిపారు. గర్భానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఐదు నెలల గర్భాన్ని యథావిధిగా కొనసాగించాలని సూచించినట్లు చెప్పారు.

ఇలాంటి పరిస్థితి అరుదుగా కనిపిస్తుందని, దీనిని వైద్యపరంగా టోర్షన్ ఆఫ్ లార్జ్ ఓవేరియన్ సిస్ట్గా పేర్కొంటారని వైద్యులు తెలిపారు. కణితిని తొలగించడంతో పాటు గర్భాన్ని సురక్షితంగా కొనసాగించేలా చికిత్స అందించిన వైద్య బృందాన్ని గర్భిణి కుటుంబ సభ్యులు అభినందించారు.

ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ గౌతమ్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది బి. సాయికృష్ణారెడ్డి, అనిత, శ్రీదేవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో అరుదైన శస్త్రచికిత్స…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *