జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) జిల్లా కమిటీ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున ఇళ్ల స్థలాలు కేటాయించాలని TWJF ప్రతినిధులు కోరారు. వార్తా సేకరణ సమయంలో జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కలెక్టరేట్‌లో జర్నలిస్టుల కోసం ప్రత్యేక మీడియా పాయింట్ లేదా గది ఏర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి జర్నలిస్టులకు అవసరమైన అధికారిక సమాచారం సకాలంలో అందేలా సమన్వయం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో TWJF జిల్లా అధ్యక్షుడు ఎ. పరిపూర్ణం, కోశాధికారి బాదం పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి పి. వెంకటస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ హౌదేకర్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.: జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన నాగర్ కర్నూలు కలెక్టర్..
