ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు……. పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి……. రైతులతో కలిసి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం……… బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి………. నాగర్ కర్నూల్……….. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజులలోనే ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని అధికారంలోకి వచ్చి సుమారు 1000 రోజులు అవుతున్న సమస్యలు పరిష్కరించకపోవడం తగదని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి తెలిపారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన గారెంటీలు అమలు చేస్తున్న పథకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు విద్యార్థులకు యువకులకు రైతులకు నిరుద్యోగులకు డిక్లరేషన్లలో ఆ పార్టీ అధినేతల సమక్షంలో అనేక హామీలను ప్రకటించడం జరిగిందని 35 అంశాలపై బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పథకం ప్రైవేటు ఉద్యోగులకు 11వ హామీగా పెండింగ్లో ఉన్న మూడు డిజైన్లను తక్షణమే చెల్లిస్తామని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒకటవ తేదీన వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని సప్లమెంటరీ బిల్లులు 15 పని దినాలలో చెల్లిస్తామని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ దారులకు డి ఏ నువ్వు సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తామని జీవో నెంబర్ 315 సవరించి ఉద్యోగ బాధిత ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని కొత్త పిఆర్సి ని ప్రకటించి ఆరు నెలల లోపు సిఫారసులను అమలు చేస్తామని ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అన్ని రకాల జబ్బులకు అన్ని ఆసుపత్రిలో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వీటిని అమలు చేయకపోవడం వల్ల ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించినట్లు వివరించారు భవిష్యత్తులో వారు నిర్వహించే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల తో పాటు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు నిరుద్యోగులు కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏంటి ప్రాజెక్టు పై చర్చించినట్లు ప్రకటనలు ఇచ్చారు కదా వాటి ఏజెండాను తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించాలని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలని లేదంటే రైతులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదుల రిజర్వాయర్ నుండి పాలమూరు రంగారెడ్డి పథకానికి గండికొడుతూ తిండి ప్రాజెక్టుకు నీటిని మళ్ళిస్తే సహించేది లేదని రైతులకు నష్టం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే పనులను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు అర్థం రవి బాలా గౌడ్ కౌన్సిలర్ అర్జునయ్య భీముడు సత్యం అహ్మద్ వెంకటస్వామి దామోదర్ విష్ణు చారి మూలింటి వెంకటేశ్వర్లు ప్రవీణ్ చారి సుభాష్ తదితరులు పాల్గొన్నారు: ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు.. Post navigation కులగణనలో ఓపెన్ కాలం తొలగించి ప్రత్యేక బీసీ కాలమ్ పెట్టాలి: పెద్ద చింతరేవులలో వైభవంగా రాఘవేంద్ర స్వామి ఆరాధన పూజలు..