రేవతి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. బి.పీ.ఎడ్ కోర్సు మొదటి సంవత్సరం ఫీజు కోసం తన స్వంత నిధుల నుంచి రూ.32,000 చెక్కును విద్యార్థినికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఆమె చదువుకు అడ్డంకిగా మారకుండా సహాయం అందించారు.
అంతేకాకుండా రేవతి బి.పీ.ఎడ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసే వరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ పూర్తి అండగా ఉంటానని మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం ఏ విద్యార్థి కలలకు అడ్డంకి కాకూడదన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ ఒక్కరి చదువు మధ్యలో ఆగిపోకూడదన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. చదువుకోవాలనే తపన ఉన్న ప్రతి పేద విద్యార్థికి తన వంతు సహాయం అందిస్తానని పేర్కొన్నారు. రేవతి తన కోర్సును విజయవంతంగా పూర్తి చేసి మంచి భవిష్యత్తును నిర్మించుకునే వరకు అండగా ఉంటానని చెప్పారు.
పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్న మర్రి జనార్దన్ రెడ్డికి రేవతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.: మరోసారి దాతృత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..
