నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టకుండా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కుల వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని దన్నోజు అరవింద్ చారి కోరారు. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. బీసీల జనాభా లెక్కలు వెల్లడైతే రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం కులగణన విషయంలో వెనుకడుగు వేస్తోందని ఆయన ఆరోపించారు.

బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా దక్కాలంటే కులగణన తప్పనిసరి అని ఆయన అన్నారు. కులగణన చేపట్టకపోతే దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గం హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు శివ, హనుమంతు, సత్య, నారాయణ, శేఖర్, రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.: కులగణన చేపట్టకుంటే బీజేపీని బీసీ సామాజిక వర్గం క్షమించదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *