క్లిష్టమైన ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య సాంకేతికతతో చికిత్స అందించడంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ముందంజలో ఉందని ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు. కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలకు సంబంధించిన సంక్లిష్టమైన సమస్యలకు ఆధునిక రోబోటిక్, లాప్రోస్కోపిక్ విధానాల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

సాధారణంగా 24 గంటల వరకు సమయం పట్టే అత్యంత క్లిష్టమైన పేగు ఆపరేషన్లను సైతం అధునాతన లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు. ఆధునిక రోబోటిక్ టెక్నాలజీతో శస్త్రచికిత్సలను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీల్లో సాధారణ ఓపెన్ సర్జరీతో పోలిస్తే కోత పరిమాణం తక్కువగా ఉండటం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం తక్కువ సమయంలోనే తమ సాధారణ దైనందిన కార్యకలాపాలకు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు.

అత్యాధునిక రోబోటిక్, లాప్రోస్కోపిక్ చికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వర్తిస్తుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య ఖర్చుల విషయంలో రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్లు సుదర్శన్ రెడ్డి, రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.: యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *