ఉద్యోగులకు ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంచిన న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ మహా ధర్నా చేపట్టారు. ముఖ్యంగా ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఇకపై కాలయాపన చేయకుండా పరిష్కరించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను సాధించేందుకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా స్థాయిలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
మహా ధర్నాలో జేఏసీ సెక్రటరీ జనరల్ రాజశేఖర్ రావు, అడిషనల్ సెక్రటరీ జనరల్స్ సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్ శర్మ, శ్రీధర్ రావుతో పాటు జేఏసీ భాగస్వామ్య సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై మహా ధర్నాకు మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు: పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ నాగర్‌కర్నూల్‌లో ఉద్యోగుల మహా ధర్నా


