నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో గురువారం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–28 సంవత్సరాలకు సంబంధించిన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో నూతన కమిటీని ఎంపిక చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల జిల్లా నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా దేవరపాగా బంగారయ్య, జిల్లా అధ్యక్షుడిగా వేముల కుర్మయ్య, ప్రధాన కార్యదర్శిగా కుందేటి మహేష్, కోశాధికారిగా కొత్త పరశురాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా పారిజాత, బొల్లం శ్రీశైలం, నరసింహ, బాల నారాయణ, నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా జయమ్మ, శేఖర్, వెంకటేష్, నరేందర్ గౌడ్‌లను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఉద్యోగులు, సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు నూతన కమిటీ కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు, వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఉద్యోగులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

సమావేశంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.: రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *